: పంజాబ్ మంత్రిని బాలీవుడ్ విలన్ గా అభివర్ణించిన కేజ్రీవాల్!
పంజాబ్ మంత్రి విక్రమ్ సింగ్ మజితను బాలీవుడ్ విలన్ గా సీఎం కేజ్రీవాల్ అభివర్ణించారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో విక్రమ్ కు సంబంధాలు ఉన్నాయని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన్ని జైలుకు పంపడం ఖాయమని అన్నారు. పంజాబ్ లో అధికార అకాలీదళ్ పార్టీని ఓడించాలని పిలుపు నిచ్చిన ఆయన, తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి , విక్రమ్ సింగ్ సోదరి హర్ సిమ్రత్ కౌర్ ఘాటుగా స్పందించారు. తన సోదరుడిపై కేజ్రీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, పంజాబ్ లో అకాలీదళ్ కనుక గెలిస్తే, ఆయన్నే జైలుకు పంపుతామని హెచ్చరించారు.