: జల్లికట్టు నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు


జల్లికట్టు గురించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు వివాదాన్ని ఆయన తనకు అనుకూలంగా మలచుకుని మాట్లాడారు. దేశమంతా ఉమ్మడి పౌరస్మృతి చెల్లదని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని... తమిళనాడులో జల్లికట్టుపై జరుగుతున్న ఉద్యమమే దీనికి నిదర్శనమని ఒవైసీ అన్నారు. మరోవైపు జల్లికట్టు ఘనతంతా తమకే చెందాలని తమిళనాడులో రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకేలు రంగంలోకి దిగాయి. తాజాగా తమిళనాడుకు చెందిన బీజేపీ నేత రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కేంద్ర మంత్రి దావేతో భేటీ అయ్యారు. నిషేధిత జంతువుల జాబితా నుంచి ఎద్దును తొలగించాలని వారు కోరారు. జల్లికట్టు కోసం ఆర్డినెన్స్ ను తీసుకురావాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News