: రైల్ రోకో.. డీఎంకే నేత స్టాలిన్ అరెస్టు
‘జల్లికట్టు’ పై నిషేధాన్నిఎత్తివేయాలని కోరుతూ తమిళనాడులో ఈరోజు బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు రైల్ రోకో చేపట్టారు. చెన్నై రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని స్టేషన్ లోకి డీఎంకే కార్యకర్తలు దూసుకెళ్లారు. దీంతో, పోలీసులు వారిని చెదరగొట్టి, స్టాలిన్ సహా పలువురిని అరెస్టు చేశారు.