: మీ జ్ఞాపక శక్తిని కాపాడే చిన్న రక్త పరీక్ష


వయసు మీద పడుతున్న కొద్దీ విషయాలు గుర్తుండవు. జ్ఞాపక శక్తి కుచించుకుపోతుంది. దీనినే అల్జీమర్స్ వ్యాధిగా పేర్కొంటారు. దీనిని ముందుగానే గుర్తించే పరీక్షలు ఇంతవరకూ లేవు. తొలిసారిగా ఆస్ట్రేలియా పరిశోధకులు సులభ పరీక్షను కనిపెట్టారు. చిన్న రక్తపరీక్ష ద్వారానే భవిష్యత్తులో రానున్న మతిమరపు మహమ్మారిని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు.

273 మంది రక్తాన్ని పరిశీలించగా, అందులో మార్పులు, బ్రెయిన్ స్కాన్ మార్పులతో సరిపోలినట్లు వీరు గుర్తించారు. వాస్తవానికి అల్జీమర్స్ వ్యాధి పెరగకుండా ఆపే మందులు లేవు. అయితే, అల్జీమర్స్ రావడానికి 17 ఏళ్ల ముందుగానే రక్తంలో అమిలాయిడ్ బీటా ప్రొటీన్ అసహజంగా మారడం మొదలవుతుందని, ఇంత ముందుగా గుర్తించడం వల్ల వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని ఫ్లోరే ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్స్ అండ్ మెంటల్ హెల్త్ కు చెందిన నోయల్ ఫాక్స్ చెప్పారు.

  • Loading...

More Telugu News