: జల్లికట్టుపై స్పందించిన హీరో మహేష్ బాబు!


తెలుగు సినీ ఇండస్ట్రీలో మిస్టర్ కూల్ గా ప్రిన్స్ మహేష్ బాబును అభివర్ణించవచ్చు. సాధారణంగా ఇతర ఫంక్షన్లకు వెళ్లడం, కామెంట్స్ చేయడం మహేష్ కు అలవాటు లేదు. ప్రతి విషయంలోనూ అతను సైలెంట్ గానే ఉంటాడు. ఎప్పుడూ ఏ వివాదంపై స్పందించని మహేష్... జల్లికట్టుపై ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జల్లికట్టుకు మద్దతు పలుకుతున్నట్టు ట్విట్టర్ లో తెలిపాడు. తమిళుల ఐకమత్యం సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. జల్లికట్టు కోసం వారి ఐకమత్యానికి తాను మద్దతు పలుకుతున్నానని చెప్పాడు. తమ సంప్రదాయాల కోసం తమిళ విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటం అద్భుతమని తెలిపాడు. మహేష్ బాబు పుట్టి పెరిగింది తమిళనాడులోనే. అందుకే అతనికి తమిళ సంప్రదాయాల పట్ల పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే మహేష్ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News