: ఒబామా నిష్క్రమణతో టాప్ ప్లేస్ లోకి వెళ్లనున్న మోదీ!
సోషల్ మీడియాలో అత్యధిక పాలోయర్లను కలిగిన దేశాధినేతల్లో ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలి స్థానంలో నిలిచారు. ఆయన కాల పరిమితి ముగియనుండటంతో... అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోనున్నారు. దీంతో, ఆయన తర్వాత అధిక సంఖ్యలో ఫాలోయర్లను కలిగిన దేశాధినేతగా ఇప్పటిదాకా రెండో స్థానంలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ... ఇకపై తొలి స్థానాన్ని ఆక్రమించనున్నారు.
ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, యూ ట్యూబ్ ఇలా అన్నిటినీ కలుపుకుంటే మోదీనే నంబర్ వన్ అని ప్రధాని కార్యాలయం అధికారులు చెబుతున్నారు. మోదీకి ఫేస్ బుక్ లో 3.92 కోట్ల మంది, ట్విట్టర్ లో 2.65 కోట్లు, గూగుల్ ప్లస్ లో 32 లక్షల మంది, లింక్డ్ ఇన్ లో 19.9 లక్షలు, ఇన్ స్టా గ్రామ్ లో 58 లక్షలు, యూట్యూబ్ లో 5.91 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. మోదీ మొబైల్ యాప్ ను కూడా కోటి మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ఒక దేశాధినేతకు సంబంధించి ప్రపంచంలోనే అత్యధికంగా వాడుతున్న యాప్ ఇదే.