: ఆ క్రెడిట్ ను సినీ తారలు పొందడం సముచితం కాదు: కమలహాసన్


‘జల్లికట్టు’పై నిషేధం ఎత్తివేయాలంటూ ఈ రోజు తమిళనాడు బంద్ జరుగుతోంది. ఈ ఆందోళనలో రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, ముఖ్యంగా యువత పాల్గొన్నారు. ఈ విషయమై ప్రముఖ నటుడు కమలహాసన్ మాట్లాడుతూ, తొలిసారిగా గర్వపడే స్థాయిలో యువత ఘన కార్యంలో తలమునకలై ఉందని అన్నారు.

సినీ ప్రముఖులు వారి ఆందోళనలో పాల్గొని ఆ క్రెడిట్ ను పొందడం సముచితం కాదని, ఇది, యువకులకు దక్కాల్సిన విజయమని అన్నారు.  కాబోయే రాజకీయ నాయకులు ఆ యువతలో ఉండొచ్చని, వారి పోరాటాన్ని అడ్డుకునే అర్హత ఎవరికీ లేదని కమల్ అన్నారు. సాధారణంగా యువకులను రాజకీయ నేతలు రెచ్చగొడుతుంటారని, ఇప్పుడు మాత్రం ఆ రాజకీయనేతలే ఆశ్చర్యపోయేలా యువత రంగంలోకి దిగిందన్నారు.

  • Loading...

More Telugu News