: 15 రోజుల్లో మంత్రి రావెలపై ఊహించని చర్యలు ఉంటాయ్: టీడీపీ నేతలతో నారా లోకేష్


ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. టీడీపీ నేతలతో, కార్యకర్తలతో ఆయన వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది. తాజాగా, పత్తిపాడు టీడీపీ నేతలు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. పార్టీ కోసం పని చేస్తున్న వారిని రావెల పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా లోకేష్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన లోకేష్... మరో 15 రోజుల్లో రావెలపై మీరు ఊహించని చర్యలు ఉంటాయని చెప్పారు. దీంతో, పార్టీ శ్రేణులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.


  • Loading...

More Telugu News