: రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలనుకున్న టాలీవుడ్ బిజీ భామ!


చిన్నప్పుడు తన పెళ్లి గురించి తనకు ఎన్నో కలలు ఉండేవని టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా తెలిపింది. 22 లేదా 23 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టగానే పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్నని చెప్పింది. ఇప్పుడు ఆ విషయం తలుచుకుంటేనే నవ్వు వస్తోందని అంది. తనకే కాదు ఈ విషయం వింటే మీకు కూడా నవ్వు వస్తుంది కదూ? అంటూ చమత్కరించింది. ఇప్పుడు తన ధ్యాస అంతా కెరీర్ పైనే ఉందని... ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని చెప్పింది.

  • Loading...

More Telugu News