: నిరాహార దీక్షకు దిగిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్!
తమ సాంప్రదాయ క్రీడ జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా నిరసనకారులు మెరీనా బీచ్ లోనే ఉంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా వారు అక్కడ నుంచి కదలడం లేదు. వీరికి మద్దతుగా రాజకీయ, సినీ ప్రముఖులు కూడా కదలివస్తున్నారు. తాజాగా, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కూడా వీరికి జత కలిశాడు. జల్లికట్టు కోసం ఆయన నిరాహార దీక్షకు దిగాడు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు.
జల్లికట్టు వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, ఇప్పుడు తాము ఆర్డినెన్స్ ఇవ్వలేమంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. రాష్ట్ర వ్యాప్త బంద్ కు కూడా నిరసనకారులు పిలుపునిచ్చారు.