: ధోనీ సూచనలతోనే వికెట్లు తీశాను: అశ్విన్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సహకారంతోనే మూడు వికెట్లు తీయగలిగానని రవి చంద్రన్ అశ్విన్ తెలిపాడు. వికెట్ల వెనుకుంటే ధోనీకి బ్యాట్స్ మన్ బలహీనతలతో పాటు, బౌలర్ వేయాల్సిన బంతుల స్థానాలు కూడా సులువుగా తెలుస్తాయని, అందుకే తాను ధోనీతో మాట్లాడానని చెప్పాడు. ధోనీ తనకు రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయమని సలహా ఇచ్చాడని, ధోనీ సలహా పాటించిన తాను మూడు వికెట్లు తీయగలిగానని అన్నాడు. మ్యాచ్ లో తనతో పాటు జడేజా కూడా అద్భుతంగా రాణించాడని, పరుగులు నియంత్రించాడని తెలిపాడు.