: ట్రంప్ కు స్వాగత కార్యక్రమాల్లో ఆడి పాడనున్న బాలీవుడ్ నటి!


అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ తరపున నాడు పాల్గొన్న బాలీవుడ్ నటి, మోడల్ మనస్వీకి తాజాగా మరో అవకాశం దక్కింది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా నిర్వహించే వేడుకల్లో ఆమె ఆడి పాడనుంది. లింకన్ మోమోరియల్ వద్ద నిర్వహించనున్న ఈ స్వాగత కార్యక్రమంలో బాలీవుడ్ లోని పలు హిట్ సాంగ్స్ కు డ్యాన్స్ లతో అదరగొట్టనున్నారని, ట్రంప్ కూర్చునే వేదికపైనే మనస్వీ ఆడి పాడుతుందని సమాచారం.

  • Loading...

More Telugu News