: సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మ నియామకం


సీబీఐ డైరెక్టర్ గా ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్ కుమార్ వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. డిసెంబర్ 2న అనిల్ సిన్హా సీబీఐ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఈ పదవిలో ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ ఆస్థానా సీబీఐ ఇన్ ఛార్జిగా ఉన్నారు. కాగా, సీబీఐ డైరెక్టర్ ఎంపికపై మూడు రోజుల క్రితం ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

అయితే, ఆ పదవిలో ఎవరిని నియమించాలనే నిర్ణయాన్ని వాయిదా వేయడం విదితమే. సీబీఐ డైరెక్టర్ పదవి రేసులో 45 మంది ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలించగా, చివరకు అలోక్ వర్మను నియమించారు. ఈ రేసులో కృష్ణ చౌదరి, అరుణా బహుగుణ, ఎస్.సి. మాధుర్ పేర్లు బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఇక సీబీఐ కొత్త చీఫ్ గా నియమితులైన అలోక్ వర్మ గురించి చెప్పాలంటే.. 1979 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం ప్రాంతాల్లో పనిచేశారు. తీహార్ జైలు డీజీగా కూడా వ్యవహరించారు.


  • Loading...

More Telugu News