: అఖిల ప్రియ వాహనంపై దాడి జరిగిందనడం అవాస్తవం: అంబటి రాంబాబు
టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై తమ కార్యకర్తలు దాడి చేశారనడం అవాస్తవమని వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, భూమా అఖిల ప్రియ వెళ్లిన దారిలోనే జూపూడి ప్రభాకర్ కూడా వెళ్లారని, ఆయన కూడా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి వలస వెళ్లిన నేతేనని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అఖిల ప్రియ వాహనంపై దాడి చేస్తే, జూపూడిని ఎందుకు వదిలి ఉంటారని ఆయన నిలదీశారు. పోలీసులే ఆమె వాహనాన్ని అనుమతించలేదని ఆయన తెలిపారు. జగన్ పర్యటనను వివాదం చేయాలన్న ఉద్దేశ్యంతో లేని వివాదాన్ని టీడీపీ నేతలు రాజేస్తున్నారని ఆయన చెప్పారు.