: రాహుల్ జీ! ఈ వంద రూపాయలతో చినిగిన కుర్తా జేబు కుట్టించుకోండి!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన కుర్తా జేబు చిరిగిందంటూ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు విమర్శల వర్షం కురిపించగా, కర్ణాటక బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు రాహుల్ కు కొత్త చొక్కా కొనిస్తానని ప్రకటించారు. మరో తాజా వార్త ఏంటంటే, ఘజియాబాద్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ముఖేశ్ మిట్టల్, రాహుల్ పేరిట వంద రూపాయల డీడీ తీసి స్పీడ్ పోస్టు ద్వారా న్యూఢిల్లీకి పంపారు. ఆ వంద రూపాయలతో చినిగిన కుర్తా జేబు కుట్టించుకోవాలని కోరారు. ఎందుకంటే, ఒక సామాన్యుడిగా జీవనం సాగిస్తున్న రాహుల్ వద్ద కొత్త కుర్తా కొనుక్కునే డబ్బు కూడా లేకపోవడం తనకు ఎంతో బాధ కల్గిస్తోందంటూ ముఖేశ్ మిట్టల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, పేదలకు ప్రతినిధిని అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడైనా చినిగిన దుస్తులు ధరించారా? అని రాహుల్ వ్యాఖ్యానించడంపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.