: పచ్చగా ఉన్న అమరావతికి జగన్ అనే చీడ పురుగు పడుతోంది: మంత్రి దేవినేని


పచ్చగా ఉన్న అమరావతికి జగన్ అనే చీడ పురుగు పడుతోందని ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. రాజధాని ప్రాంతాల పర్యటనకు జగన్ వెళ్తే, అక్కడి రైతులే ‘గో బ్యాక్’ అంటూ నిరసనలు తెలుపుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి యత్నించిన అంశాన్ని ప్రస్తావించారు. సచివాలయానికి వెళ్తున్న అఖిల ప్రియను ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవాలని చూశారని, దీనికి బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ ఆదేశించారు.

  • Loading...

More Telugu News