: రియల్ ఎస్టేట్ రంగంలో 100 కోట్ల పెట్టుబడులు పెట్టిన జకీర్ నాయక్


వివాదాస్పద ప్రముఖ ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ కు సంబంధించిన ఆసక్తికర అంశాలను ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. జకీర్ నాయక్ కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ సుమారు వంద కోట్ల రూపాయలను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టినట్టు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. జకీర్ నాయక్ కు చెందిన 78 బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని వారు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఖాతాలు, ఆదాయపు పన్ను పత్రాలు, ఇతర వివరాలన్నీ పరిశీలించిన తరువాత జకీర్ నాయక్ కు సమన్లు జారీ చేస్తామని వారు తెలిపారు.

ఈ వ్యవహారంలో జకీర్ నాయక్ సహచరులైన మరో 20 మందిని వారు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇందులో జకీర్ నాయక్ సోదరి నిలా నౌషద్ నూరానీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఢాకాలో బేకరిపై దాడి చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది తాను జకీర్ నాయక్ ప్రసంగాలతో స్పూర్తి పొంది తీవ్రవాదిగా మారినట్టు చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు జకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై నిషేధం విధించి, తనిఖీలు నిర్వహించి, కంప్యూటర్లు, సీడీలు, హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకుని, బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News