: ముప్ఫై ఏళ్ల తర్వాత రజనీ, కమల్ కలసి ఫొటోకు పోజ్ లిచ్చారు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమలహాసన్ కలిసి ఫొటోలకు పోజ్ లిచ్చారు. ఫొటోలకు పోజ్ లివ్వడం ఆర్టిస్టులకు కొత్తేమి కాదుగా.. మరి, ఈ ఫొటోలు ఎందుకంత ప్రత్యేకం అంటే.. రజనీ, కమల్ కలిసి ముప్ఫై ఏళ్ల తర్వాత ఫొటోలకు పోజ్ లిచ్చారు కనుక. 'వికటన్' అవార్డుల వేడుకలో జీవిత సాఫల్య పురస్కారాన్ని రజనీ చేతుల మీదుగా కమల్ అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫొటో షూట్ లో అగ్ర నటులు ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరడంతో రజనీ, కమల్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.