: యూకేలో భారత సంతతి మహిళను హత్య చేసి.. సూట్ కేసులో కుక్కిన దుండగులు


యూకేలో 17 ఏళ్ల నుంచి ఓ కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తోన్న భారత సంతతికి చెందిన 46 ఏళ్ల కిర‌ణ్ దాడియా అనే మహిళను దుండ‌గులు దారుణంగా హ‌త్య చేశారు. ఆఫీసుకు వెళ్లిన త‌న సోద‌రి కనిపించడం లేదని కిరణ్ సోదరి జస్బీర్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆఖ‌రుసారిగా ఆమె జాబ్‌కు వెళ్లే ముందు త‌న‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపింది. ఈ నేప‌థ్యంలో లీసెస్ట‌ర్‌లోని క్రొమ‌ర్ స్ట్రీట్‌లో ఓ గుర్తు తెలియ‌ని సూట్‌కేసు గురించి తెలుసుకున్న పోలీసులు ఆ సూట్‌కేసును తెర‌చిచూడ‌గా అందులో రక్తపు మరకలతో ఉన్న కిరణ్ దాడియా మృతదేహం క‌నిపించింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గురైన మహిళ భర్త అశ్విన్ దాడియాని అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం కిర‌ణ్‌దాడియా మృతదేహాన్ని పోలీసులు ఆసుప‌త్రికి తరలించారు. కేసులో ఆధారాల కోసం సీసీటీవీ ఫుటేజీని సేకరించారు.

  • Loading...

More Telugu News