: కెరీర్ లో అత్యధిక పరుగులు సాధించడం ఆనందంగా ఉంది: యువరాజ్ సింగ్
ఇంగ్లండ్ తో కటక్ లో జరిగిన మ్యాచ్ లో తన కెరీర్ లోనే అత్యధిక పరుగులు (150) సాధించడం ఆనందంగా ఉందని ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. బ్యాటింగ్ ముగిసిన అనంతరం మాట్లాడుతూ, తన ప్రదర్శనపట్ల సంతోషంగా ఉన్నానని తెలిపాడు. అనవసరంగా ఆవేశపడకూడదని ముందుగానే నిర్ణయించుకున్నానని యువీ చెప్పాడు. ఇలాంటి ఇన్నింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఇన్నాళ్టికి తాను కోరుకున్న విధంగా ఆడగలిగానని తెలిపాడు.
మరో ఎండ్ లో ధోనీ తనకు పూర్తి సహకారం అందించాడని అన్నాడు. ధోనీ కూడా సెంచరీ చేయడం మరింత ఆనందాన్నిచ్చిందని చెప్పాడు. ఎంతో అనుభవమున్న ఆటగాడిగా, విజయవంతమైన కెప్టెన్ గా కీర్తినందుకున్న ధోనీ కూడా ఈ మ్యాచ్ లో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించిందని యువీ పేర్కొన్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో భారత జట్టు కేవలం 6 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.