: ఇరాన్‌లో ప్రఖ్యాతిగాంచిన ప్లాస్కో భవనంలో మంటలు.. 17 అంతస్తుల భవనం కుప్పకూలి 30మంది మృతి
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఈ రోజు ఘోర ప్రమాదం సంభవించింది. ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ప్లాస్కో భవనంలో మంటలు వ్యాపించాయి. సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని వాటిని అదుపులోకి తెస్తుండగా ఒక్కసారిగా 17 అంతస్తుల ఆ భవనం కుప్పకూలిపోయింది.
ఈ ఘటనలో సుమారు 30 మంది అగ్నిమాపక సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 75 మంది గాయపడ్డారు. వారిలో 30 మంది సాధారణ పౌరులు కాగా, 45 మంది అగ్నిమాపక సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భవనం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ భవనాన్ని 1960లో జ్యూయిష్ వ్యాపారవేత్త హబిబ్ ఎల్గానియన్ నిర్మించారు. అప్పట్లో టెహ్రాన్‌లోనే ఇది అత్యంత ఎత్తైన భవనం.