: ధోనీ బౌల్డయ్యాడు...అంపైర్ బౌండరీ ఇచ్చాడు!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బౌల్డ్ అయితే అంపైర్ బౌండరీ ఇచ్చిన ఘటన కటక్ లోని బారాబతి స్టేడియంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...42వ ఓవర్ చివరి బంతికి యువరాజ్ సింగ్ ను వోక్స్ పెవిలియన్ కు పంపాడు. అనంతరం ప్లంకెట్ వేసిన 43వ ఓవర్ మూడో బంతిని నోబాల్ గా సంధించాడు. దానిని స్క్వేర్ లెగ్ దిశగా ఆడిన ధోనీ రెండు పరుగులు చేశాడు. దీంతో మళ్లీ ధోనీ బ్యాటింగ్ కు వచ్చాడు. నోబాల్ కావడంతో తరువాతి బంతిని ధోనీ భారీ షాట్ గా మలిచే ప్రయత్నంలో బంతిని అంచనా వేయలేక క్లీన్ బౌల్డయ్యాడు. వికెట్లను తాకిన బంతి బౌండరీ లైన్ ను ముద్దాడింది. ఫ్రీ హిట్ కావడంతో అవుట్ ఇవ్వని అంపైర్ బౌండరీ ఇచ్చాడు. కాగా, క్రికెట్ లో ఫ్రీ హిట్ కు క్యాచ్, లేదా బౌల్డ్ అయితే అవుట్ ఇవ్వరు, స్టంప్ అవుట్ ను ఇస్తారు. దీంతో ధోనీ బతికిపోయాడు.