: ముస్లిం రిజర్వేషన్లపై తీర్మానం చేసి, చేతులు దులుపుకోవాలనుకుంటున్న కేసీఆర్: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర


ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యల పట్ల టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తర్వాత కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 12 లక్షల మంది పేదలు దరఖాస్తు చేసుకుంటే... కేవలం 53 వేల మంది మాత్రమే అర్హులంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం తేల్చిందని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాల గొంతు నొక్కితే సభ బాగా జరిగినట్టా? అని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News