: ఊచకోతకు సిద్ధమైన యువీ.. భారీ షాట్లకు శ్రీకారం!
కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో యువరాజ్ సింగ్ విశ్వరూపం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. నిలకడగా ఆడి సెంచరీ సాధించిన యువరాజ్ సింగ్ వెంటనే శివాలెత్తాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి తన ఉద్దేశ్యం చాటి చెప్పాడు. 2008లో ఇదే జట్టుపై సాధించిన 138 పరుగుల స్కోరు దాటేందుకు యువీ దూకుడు పెంచాడు. అందులో భాగంగా ఇప్పటికే 108 బంతుల్లో 117 పరుగులు సాధించాడు. మరోపక్క, ధోనీ 89 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ 202 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో భారత జట్టు 37 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగులు సాధించింది.