: ట్రైనీ ఎస్ఐ ఆత్మహత్య!
హైదరాబాద్ షామీర్ పేట్ లోని సీఐఎస్ఎఫ్ లో ట్రైనీ ఎస్ఐ సచిన్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కాగా, గత అక్టోబర్ నుంచి శిక్షణ పొందుతున్న సచిన్ స్వస్థలం హర్యానా.