: తిరుమల భక్తులకు పంపిణీ చేసే సాంబారు అన్నంలో జెర్రి !
తిరుమలలో పంపిణీ చేసే సాంబారు అన్నంలో ‘జెర్రి’ రావడంతో భక్తులు నిర్ఘాంతపోయారు. యాత్రికుల వసతి సముదాయం వద్ద భక్తులకు సాంబారు అన్నం పంపిణీ చేశారు. ఈ సంఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా,ఈ సంఘటనపై ఈవో సాంబశివరావు స్పందిస్తూ, విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.