: ‘జల్లికట్టు’ను నిషేధిస్తే జంతు హింస ఎలా తగ్గుతుంది?: ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ రవిశంకర్


‘జల్లికట్టు’ను నిషేధిస్తే జంతు హింస ఎలా తగ్గుతుందో తనకు అర్థం కావడం లేదని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ రవిశంకర్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘జల్లికట్టు’ పై నిషేధం విధించడం కన్నా ముందు పశువులను కబేళాలకు తరలించే వారిని అడ్డుకోవాలని ఆయన సూచించారు. ‘పొంగల్’ పండగలో ‘జల్లికట్టు’ ఓ భాగం అని, పశువులను శుభ్రం చేయడం, పూజించడం, ఆలింగనం చేసుకోవడం, వాటితో ఆడుకోవడం.. ఇది చాలా కాలంగా వస్తున్న ఆచారమని అన్నారు. తమిళ సంప్రదాయ క్రీడ అయిన ‘జల్లికట్టు’ను వ్యతిరేకిస్తున్న వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఈ క్రీడపై నిషేధం విధించడం సబబు కాదని అన్నారు. ఒకరిద్దరు నిబంధనలు అతిక్రమించొచ్చు.. కొంత మంది తప్పు చేయవచ్చు.. అలాగని చెప్పి ఈ క్రీడను నిషేధించడం సరికాదన్నారు. హర్యానాలో ‘కుస్తీ’ క్రీడను నిషేధిస్తే, జనం ఊరుకుంటారా? అని రవిశంకర్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News