: పథకం అమలు కాకుంటే వెంటబడి కొట్టండని చెబుతా: మంత్రి డీఎల్
ముఖ్యమంత్రి ప్రకటించిన 'బంగారు తల్లి పథకం'పై క్యాబినెట్ సమావేశంలో చర్చించలేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. దీనిపై తనతోనూ సంప్రదించలేదని అన్నారు. పథకాలు ప్రకటించగానే సరిపోదని, అవెలా అమలవుతున్నాయో కూడా చూసుకోవాలని డీఎల్ ముఖ్యమంత్రికి హితవు చెప్పారు. సొంత గుర్తింపు కోసం పథకాలు ప్రకటించగానే సరిపోదన్న డీఎల్, అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. పథకం మంచిదే కానీ, అమలు కాకపోతే కాంగ్రెస్ నేతలను వెంటబడి కొట్టాలని ప్రజలకు తానే చెప్తానని డీఎల్ హెచ్చరించారు. రెండురోజుల కిందట మెదక్ జిల్లా బహిరంగ సభలో సీఎం కిరణ్ ఆడ పిల్లల కోసం 'బంగారు తల్లి' పథకాన్ని ప్రకటించారు. ఈరోజు నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది.