: పాతబస్తీలో కార్డెన్ సెర్చ్.. 16 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌లోని పాతబస్తీ కాలపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ రోజు 200 మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా కాలపత్తర్‌లోని పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు జరిపిన పోలీసులు 16 మంది రౌడీషీటర్లతో పాటు గ్యాంగ్‌స్టర్ ఆయూబ్‌ఖాన్ అనుచరులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 66 ద్విచక్ర వాహనాలు, రెండు కత్తులను గుర్తించిన పోలీసులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కొవ్వులతో నిల్వ ఉన్న గోదాంని సీజ్ చేశారు. విదేశీ పక్షులు, జంతువులు పెంచుతున్న ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.