: రైల్వే కోర్టుకు హాజరైన విజయశాంతి


సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి నేడు సికింద్రాబాద్ లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన రైల్ రోకో కార్యక్రమంలో విజయశాంతి కూడా పాల్గొన్నారు. అప్పట్లో రైల్ రోకో కు సంబంధించి విజయశాంతిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తమే ఆమె ఈ రోజు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. అయితే, ఆ సమయంలో జడ్జి లేకపోవడంతో, విజయశాంతి వెనుదిరిగారు.

ఈ సందర్భంగా, విజయశాంతిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారంటూ ఆమెను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, దాని గురించి తప్పకుండా మాట్లాడతానని, అయితే ఇప్పుడు మాత్రం కాదని చెప్పారు. ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News