: మోదీకి చివరి కాల్ చేసిన ఒబామా... పలు అంశాలపై చర్చ!


అమెరికా అధ్యక్షుడిగా ఒబామాకు ఇదే చివరి రోజు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ఫోన్ చేశారు. ఇరు దేశాల మధ్య ఆరోగ్యకర సంబంధాలను పెంపొందించడంలో భాగస్వామ్యం వహించినందుకు మోదీకి ఈ సందర్భంగా ఒబామా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పౌర అణు ఇంధనం, రక్షణ రంగం, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు వైట్ హౌస్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడారని తెలిపారు. భారత్ ను అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించడం, వాతావరణ మార్పుల గురించి మాట్లాడారని చెప్పారు.

2014లో భారత ప్రధానిగా మోదీ ఎన్నికైనప్పుడు అందరికంటే ముందు శుభాకాంక్షలు చెప్పింది ఒబామానే. అంతేకాదు, వీలు చూసుకుని వైట్ హౌస్ కు వచ్చి, తమ ఆతిథ్యం స్వీకరించాలని కూడా ఆహ్వానించారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు దేశాధినేతల మధ్య మంచి స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, తన మిత్రుడు మోదీకి ఒబామా ఫోన్ చేశారు. అమెరికాతో భారత్ స్నేహం ఇకపై కూడా కొనసాగాలని కోరారు. 

  • Loading...

More Telugu News