: యువ‌తుల‌ను వేధిస్తున్న పోకిరీకి వినూత్న శిక్ష‌.. బ‌ట్టలూడ‌దీసి మెడ‌లో చెప్పుల దండ‌వేసిన గ్రామ‌స్థులు


యువ‌తుల‌ను వేధిస్తున్న ఓ ఆక‌తాయికి గ్రామ‌స్థులు గ‌ట్టిగా బుద్ధి చెప్పారు. వినూత్నంగా శిక్షించి అమ్మాయిల‌ను వేధిస్తే ఎవ‌రికైనా ఇదే గ‌తి ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. క‌ర్ణాట‌క‌లోని తుముకూరు జిల్లా గుబ్బి తాలూకాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.  స్థానికంగా నివాస‌ముండే అభిషేక్‌(20) అదే ప్రాంతానికి చెందిన యువ‌తిని వేధించ‌సాగాడు. ప్రేమిస్తున్నానంటూ వెంట‌ప‌డుతున్నాడు. దీంతో ఆగ్ర‌హానికి గురైన యువ‌తి బంధువులు అభిషేక్‌కు ఆమెతో ఫోన్ చేయించారు. ఊర‌వ‌త‌ల ఉన్న తోట‌లోకి ర‌మ్మ‌నమ‌ని చెప్పించారు.

యువ‌తి ఫోన్‌తో తోట వ‌ద్ద‌కు వ‌చ్చిన అభిషేక్‌ను ప‌ట్టుకున్న గ్రామ‌స్థులు అత‌డి దుస్తులు విప్పించి మెడ‌లో చెప్పుల దండ వేశారు. గుబ్బి యువ‌తుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే అంద‌రికీ ఇదే గ‌తి ప‌డుతుంద‌ని ఓ ప‌ల‌క‌పై రాసి అత‌డి మెడ‌లో వేలాడ‌దీశారు. ఈ ఫొటోల‌ను వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. స‌మాచారం అందుకున్న బాధిత యువ‌కుడి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ద‌ళితుడు కావ‌డం వ‌ల్లే త‌న కుమారుడిపై గ్రామ‌స్తులు దాడి చేశార‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News