: అమెరికాలో ట్రంప్ ఫీవర్.. 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' వేడుకలకు సిద్ధం
ట్రంప్ ఫీవర్‌తో అమెరికా ఊగిపోతోంది. అగ్రరాజ్యాధి నేతగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రేపు(శుక్రవారం) అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ థీమ్‌తో వేడుకలు నిర్వహించనున్నారు. ట్రంప్ తన ప్రమాణ స్వీకారాన్ని వినూత్నంగా చేయనున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు ఉపయోగించిన బైబిల్‌తోపాటు, తాను గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు తన తల్లి బహుమతిగా ఇచ్చిన బైబిల్‌పై అంటే మొత్తం రెండు బైబిల్స్ పై ట్రంప్ ప్రమాణం చేయనున్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖ భారతీయ అమెరికన్లు, హాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం చారిత్రాత్మకంగా మిగిలిపోతుందని వైట్‌హౌస్ కార్యదర్శి సీన్ స్పైసర్ అభివర్ణించారు. మరోవైపు ఇప్పటికే వాషింగ్టన్‌లో సంబరాలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని ప్రజలు వీక్షించేందుకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.