: ఇంజనీరింగ్ స్టూడెంట్ ర్యాష్ డ్రైవింగ్... ఒకరి మృతి
హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదులోని రాజేంద్రనగర్ లోని హిమాయత్ నగర్ లో అత్తాపూర్ కు చెందిన ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ఓ ఇంటి బయట కూర్చుని ఉన్న వారిపైకి కారును నడిపారు. దీంతో ఈ ఘటనలో మల్లేష్ అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు కారణమైన మైనర్ ఆ సమయంలో పూటుగా మద్యం సేవించినట్టు స్థానికులు తెలిపారు. అతనితో పాటు ముగ్గురు యువతులు ఉన్నట్టు వెల్లడించారు.