: ఎంపీ కవిత సేవలను ప్రశంసించిన సినీ నటి గౌతమి
తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ఎంపీ కవిత అందిస్తున్న సేవలను లైఫ్ అగైన్ ఫౌండేషన్ చైర్ పర్సన్, ప్రముఖ సినీ నటి గౌతమి ప్రశంసించారు. ఖమ్మంలోని ‘తెలంగాణ జాగృతి’ స్కిల్ సెంటర్ ను ఆమె ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ, ఈ స్కిల్ సెంటర్ ద్వారా చేస్తున్న సామాజిక సేవను, కృషిని ఆమె కొనియాడారు. కాగా, కొత్తగూడెంలో రేపు ఏర్పాటు చేయనున్న మెగా వైద్య శిబిరానికి ఆమె హాజరుకానున్నారు.