: యువరాజే నాకు ఆదర్శం: హర్భజన్ సింగ్
టీమిండియాలోకి పునరాగమనం విషయంలో యువరాజ్ సింగే తనకు ఆదర్శమని హర్భజన్ సింగ్ తెలిపాడు. యువరాజ్ జట్టులోకి పునరాగమనం చేయడం ద్వారా ఇతర క్రికెటర్లకు స్పూర్తిగా నిలిచాడని అన్నాడు. టీమిండియాలోకి పునరాగమనం చేయాలంటే పరుగుల వరద పారించాలని గుర్తించిన యువీ, రంజీల్లో పరుగుల వరద పారించాడని అన్నాడు. తాను కూడా ఈ రెండు, మూడు నెలలు తీవ్రంగా శ్రమించి, పంజాబ్ జట్టు తరపున రంజీల్లో, ముంబై తరపున ఐపీఎల్ లో రాణించి టీమిండియాలోకి పునరాగమనం చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. స్పిన్ మాయాజాలంతో 711 వికెట్లు తీసిన భజ్జీ, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.