: ప్రతి మ్యాచ్ నూ చివరిదే అనుకుంటాను!: కేదార్ జాదవ్


తాను క్రీజులో దిగిన ప్రతిసారీ అదే చివరి మ్యాచ్ అనుకుంటానని తొలి వన్డే హీరో కేదార్ జాదవ్ అన్నాడు. రెండో వన్డే కోసం కటక్ చేరుకున్న సందర్భంగా జాదవ్ మాట్లాడుతూ, తాను బ్యాటింగ్ కు దిగినా, బౌలింగ్ చేసినా వందశాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ తనది ఇదే ఆలోచన అని చెప్పాడు. దేశం తరుఫున ఆడుతున్నప్పుడు వంద శాతం ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు. లేటువయసులో వచ్చిన అవకాశాన్ని కేదార్ జాదవ్ అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. తొలి వన్డేలో దూకుడుగా సెంచరీ చేయడంతో టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. 

  • Loading...

More Telugu News