: అసభ్య పదజాలంతో పరస్పరం దూషించుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు!
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్సీల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం.. అసభ్య పదజాలంతో దూషించుకునే వరకు వెళ్లింది. రాష్ట్ర శాసనమండలిలో ఫొటో సెషన్ లో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, సలీం కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి పద్మారావు అక్కడికి రావడంతో సలీంను వేరే కుర్చీలో కూర్చోమని ఫారూఖ్ హుస్సేన్ చెప్పారు. దీంతో, ఆగ్రహించిన సలీం, ఫారూఖ్ పై దాడికి యత్నించారు. అసభ్య పదజాలంతో పరస్పరం దూషించుకున్నారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ స్వామి గౌడ్ కల్పించుకుని వారికి సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.