: అందుకే, సోషల్ మీడియాను ఆశ్రయించక తప్పట్లేదు: డొనాల్డ్ ట్రంప్
తనపై వచ్చే ఆరోపణలను తిప్పి కొట్టడానికి తన ముందున్న ఏకైక మార్గం సోషల్ మీడియా మాత్రమేనని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, మీడియాపై తనకు నమ్మకం లేదని అన్నారు. వాస్తవానికి ట్వీట్లు చేయడం కూడా తనకు ఏమాత్రం నచ్చదని, కానీ, ఆరోపణలపై స్పందించేందుకు తనకు ఉన్న ఏకైక మార్గం సామాజిక మాధ్యమాలేనని అన్నారు. తనపై వ్యతిరేకంగా వచ్చిన వ్యాఖ్యలను మొదటి నుంచి తిప్పికొడుతున్న ట్రంప్, తాను అధ్యక్షుడిని అయిన తర్వాత కూడా అదే పద్ధతిని కొనసాగిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.