: మీ కులం ఏమిటో ఈ సాఫ్ట్ వేర్ చెప్పేస్తుంది!


రాజకీయ నాయకులకు శుభవార్త. కులాలను కనిబెట్టే సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వచ్చేసింది. ఎన్నికల సంఘం వెబ్ సైట్లో ఉన్న డేటాను ఉపయోగించుకుని... కులాల వారీగా ఓటర్లను ఈ సాఫ్ట్ వేర్ విడదీస్తుంది. ముంబైలోని ఓ కంపెనీ దీన్ని తయారు చేసింది. సామాజిక వర్గాలను బట్టి ఎన్నికల వ్యూహాలను రచించడానికి ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది. కులాల వారీగానే కాదు... ఇంటి పేరును బట్టి, అడ్రసును బట్టి ఓటర్లను విడగొడుతుంది ఇది. అంతేకాదు, ఏ ఇంట్లో ఎంతమంది ఓటర్లున్నారు... ఏ భవనంలో ఎంత మంది ఉన్నారు? తదితర వివరాలను కూడా ఇస్తుంది. బీఎంసీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో, ఈ సాఫ్ట్ వేర్ కు డిమాండ్ పెరిగిందట. ఇప్పటికే 80 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు ఈ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారట. అయితే, దీని విషయం ఇంత వరకు తమ దృష్టికి రాలేదని ఎన్నికల సంఘం తెలిపింది. కులాలను ఉపయోగించుకుని ఓట్లు అడిగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

  • Loading...

More Telugu News