: ఓటరు కార్డు చూపిస్తేనే పక్క.. లేకుంటే పస్తే అని చెప్పండి!: కెన్యా ఎంపీ వినూత్న ప్రచారం


ఓటరు కార్డు చూపిస్తేనే శృంగారం, లేకుంటే లేదని మహిళలంతా తమ భర్తలకు చెప్పాలని కెన్యా ఎంపీ మిషీ మోకో పిలుపునిచ్చారు. కెన్యాలోని మొసాంబా పట్టణానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఓటరు అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని మహిళలందరికీ ఓటు హక్కు ప్రాముఖ్యత వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు పట్ల మహిళలు చైతన్యవంతులు కావాలని సూచించారు. ఓటు హక్కు పొందేందుకు సుముఖత చూపించని భర్తలపై శృంగారాన్ని ఆయుధంగా ప్రయోగించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఓటరు కార్డు చూపిస్తేనే శృంగారంలో పాల్గొంటామని, లేకుంటే లేదని స్పష్టంగా తమ భర్తలకు చెప్పాలని ఆమె సూచించారు. తనకా ఇబ్బంది లేదని, తన భర్త ఇదివరకే ఓటరు కార్డు తీసుకున్నాడని ఆమె తెలిపారు. దేశంలో 90 లక్షల మందికి అర్హత ఉన్నప్పటికీ ఓటరుగా నమోదు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 8న పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టింది. ఫిబ్రవరి 17తో ఓటరు నమోదు పూర్తి కానుందని ఆమె చెప్పారు. ఈ లోగా అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. 

  • Loading...

More Telugu News