: ‘జల్లికట్టు’ పై మేమేం చేయలేం!: స్పష్టం చేసిన మద్రాసు హైకోర్టు


తమిళ సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’పై కొనసాగుతున్న నిషేధం విషయమై తాము జోక్యం చేసుకోబోమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన తీర్పును వెలువరించింది కనుక తాము ఇక జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కాగా, జల్లికట్టు క్రీడపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద యువత పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. అయితే, శాంతియుతంగా చేస్తున్న ఈ ఆందోళనలో విద్యుత్తు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ బాలు అనే న్యాయవాది, మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎం.సుందర్ తో కూడిన ధర్మాసనం పైవిధంగా పేర్కొంది. ఇదిలా ఉండగా, ‘జల్లికట్టు’ నిషేధాన్ని నిరసిస్తూ బీచ్ లో నిరసనకు దిగిన వారితో తమిళనాడు ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ క్రీడపై నిషేధం ఎత్తివేసే నిమిత్తం ఆర్డినెన్స్ తీసుకువచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తమిళనాడు మంత్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.   

  • Loading...

More Telugu News