: ప్రధాని మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు చేసిన శివసేన అధినేత


భారత్ ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుల కంటే ఎక్కువని మండిపడ్డారు. మోదీ నిర్ణయంతో భారతీయులంతా బలయ్యారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత చోటు చేసుకునే పరిణామాలను రిజర్వ్ బ్యాంక్ చెప్పినప్పటికీ మోదీ వినలేదని చెప్పారు. చెవిటి, మూగ రామచిలుకలాంటి ఉర్జిత్ పటేల్ ను ఆర్బీఐ గవర్నర్ గా నియమించారని విమర్శించారు. మోదీ తీసుకున్న తప్పుడు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందని తెలిపారు. ఈ మేరకు శివసేన అధికారిక పత్రికలు సామ్నా, దోపహార్ కా సామ్నాలో మోదీపై ఉద్ధవ్ థాకరే విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News