: ట్రంప్ ను వ్యతిరేకించేవారు వేశ్యలకంటే నీచమైనవారు: రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో బాధ్యతలను స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి బహిరంగంగా మద్దతు పలికారు. కొంత మంది అమెరికన్లు ట్రంప్ పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని... వారంతా వేశ్యల కంటే నీచమైనవారని పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే, గతంలో ట్రంప్ రష్యాకు వెళ్లినప్పుడు అక్కడున్న వేశ్యలతో గడిపారని... వాటికి సంబంధించిన వీడియోలు రష్యా వద్ద ఉన్నాయని... వాటి సహాయంతో భవిష్యత్తులో ట్రంప్ కు చెక్ పెడతారంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ స్పందించారు. అమ్మాయిలతో ట్రంప్ గడిపారని... ఆ వీడియోలు తమ వద్ద ఉన్నాయంటూ చేస్తున్న ప్రచారమంతా... ట్రంప్ వ్యతిరేక వర్గీయులే చేస్తున్నారని పుతిన్ మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నవారికి నైతిక విలువలు కూడా లేవని పుతిన్ అన్నారు. ఈ విషయాన్ని రష్యా మీడియా తెలిపింది.