: వైజాగ్ లోని కోరమాండల్ గేటు వద్ద యువతి కిడ్నాప్
విశాఖపట్టణం, గాజువాక పరిధి, మల్కాపురంలోని కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ గేటు ముందు యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. స్నేహితురాలిని కలిసేందుకు వచ్చిన వాసంతి (22) అనంతరం తిరిగి వెళ్తుండగా, కోరమాండల్ కంపెనీ గేటు ముందు ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. తొలుత ఓ ఆటోలో ఉన్నానని ఇంట్లో వారికి మెసేజ్ పెట్టిన సదరు యువతి, ఆ తరువాత కారులో గుర్తుతెలియని ప్రాంతంలో ఉన్నానని మెసేజ్ చేయడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఆచూకీ కనిపెట్టే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.