: 'బెయిల్ కోసం రూ. 100 కోట్ల స్కామ్'లో 'గాలి'కి ఊరట
కర్ణాటకలోని గనుల అక్రమ తవ్వకం కేసులో విచారణను ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. తాను జైల్లో ఉన్న సమయంలో బెయిల్ ఇచ్చేందుకు రూ. 100 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు నమోదైన కేసులో, ఆయనకు బెయిల్ ను రద్దు చేయాలని ఏసీబీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి జైల్లో గడిపిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. ఏసీబీ వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరుగగా, తన క్లయింటు బెయిల్ ను రద్దు చేయాలని కోరడం ఏసీబీ కక్షపూరిత చర్యగా గాలి తరఫు న్యాయవాది వాదించారు.