: ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు... గుంటూరులో సంబరాలు చేసుకున్న బాధితులు
ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారన్న ఆరోపణలు ఒకవైపు, ఏ కేసు నిమిత్తం వెళ్లినా లంచాలు తెమ్మని పీడిస్తారన్న ఫిర్యాదులు మరోవైపు వెల్లువెత్తడంతో, ఒంగోలు పీటీసీ డీఎస్పీ దుర్గా ప్రసాద్ ఇళ్లపై నేడు ఏసీబీ దాడులు చేసింది. గుంటూరు, ఒంగోలు, చీరాల, హైదరాబాద్ ప్రాంతాల్లోని ఆయన, ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు ప్రారంభించగా, విషయం తెలుసుకున్న దుర్గా ప్రసాద్ బాధితులు గుంటూరులో సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు.
ఒక్క గుంటూరులోనే 11 చోట్ల 11 బృందాలు దాడులు చేయగా, భారీ ఎత్తున అక్రమాస్తులు, నగదు బయటపడ్డట్టు తెలుస్తోంది. ఆయన బినామీ తుమ్మల సుబ్బారావు ఇంటిపై కూడా ఏసీబీ దాడులు చేసింది. గుంటూరు సమీపంలోని పలకనూరు, పేరేచర్ల తదితర ప్రాంతాల్లోని ఆయన ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.