: 'బాహుబలి' బాగాలేదన్న జమున... 'శాతకర్ణి'ని ఆకాశానికెత్తేసింది!
రాజమౌళి 'బాహుబలి' చిత్రం ఓ పిచ్చి సినిమా అంటూ, బహిరంగంగా విమర్శించి, అభిమానుల ఆగ్రహానికి గురైన సీనియర్ నటి జమున, బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై ప్రశంసల వర్షం కురిపించారు. బాలయ్యతో కలసి సినిమా ప్రత్యేక ప్రదర్శనను వీక్షించిన ఆమె, తెలుగు సినిమా చరిత్రలో ఈ చిత్రం ఒక తురుపు ముక్కగా మిగులుతుందని, శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించాడని కొనియాడారు. బాలయ్య నుదుటిపై ఆమె ప్రేమగా ముద్దాడింది. 79 రోజుల్లో ఓ మంచి చిత్రాన్ని చక్కగా తీశాడని క్రిష్ ను అభినందిస్తూ, కమర్షియల్ అంశాల కోసం కథను దారి మళ్లించకుండా నడిపించారని జమున పేర్కొన్నారు.