: ఇకపై పది మందికి ఒకేసారి టికెట్లు: టీటీడీ వెసులుబాటు


ఇంతవరకూ ఆన్ లైన్లో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి గరిష్ఠంగా ఆరుగురికి మాత్రమే టికెట్లను బుక్ చేసుకునే వీలుండగా, దాన్ని పది మంది వరకూ బుక్ చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆరుగురికన్నా ఎక్కువగా ఉన్న కుటుంబాల వారు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈఓ సాంబశివరావు వెల్లడించారు. త్వరలోనే టీటీడీ యాప్ ను అందుబాటులోకి తీసుకు వస్తామని, దీని ద్వారా సేవా టికెట్లను, గదులను బుక్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News