: ఆర్మీ అధికారుల దుస్తుల్లో చొరబడ్డ ఏడుగురు ఉగ్రవాదులు... ఢిల్లీలో హై అలర్ట్


దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, డొమెస్టిక్ టెర్మినల్, మెట్రో స్టేషన్లు, రద్దీగా ఉన్న  ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఏడుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని... వాళ్లంతా మన సైన్యంలోని సుబేదార్, కెప్టెన్ ర్యాంకుల దుస్తులు ధరించారని నిఘా విభాగం హెచ్చరించింది. దీంతో ఢిల్లీలో భద్రతను పెంచారు. చక్రి, గురుదాస్ పూర్ బోర్డర్ పోస్టుల సమీపంలో మన ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు కనిపించారని అమృత్ సర్ నుంచి ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. రిపబ్లిక్ డే సమీపిస్తున్న తరుణంలో... ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో స్క్రీనింగ్ పెంచామని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News